Wednesday, April 14, 2010

నీ స్నేహం

దూర దూరాల తీరం దరి చేరువేల
నా జీవితం చేసింది నీతో సావాసం
నీతో గడిపిన అనుక్షణం ఆనందక్షణం
నీవు ఎదురైనా ప్రతి క్షణం
ఎదలో జనించింది ఆనందవర్షం
నీటి చుక్కల్ని నది కౌగిటిన చేర్చిన
సేలయెర్ల సందడిన
తూనీగల బృదం తమ రెక్కలను చాచి నాట్యమాడువలె........
నీ చెంత నా మనస్సు చేరి నీ ఆనందపు జల్లుల్లో
పరవశిస్తూ మౌనరాగాలతో పల్లకిస్తుంది........................

Monday, April 12, 2010

నీ స్నేహం

చుక్కలకే వల వేసి
దోసిట్లో నింపి,
పువ్వులనే తుంచి
నీ చెంత ఉంచి,
హరివిల్లును వంచి
నీ కౌగిటిన చేర్చి....
అంతులేని ఆనంద సాగర తీరంన నీతో ఆటలాడి
ఆనందపు వర్షంలో నీ మదిని తడిపి
జీవిత కాలం నిను ఆనందింప చేస్తా ...........
ఇంత ఆనదాన్నిపంచుటకు నీవెవరని? ప్ర శ్నించకు ...
నేను నీ నేస్తాన్ని..............నీ


Friday, April 9, 2010

నీ స్నేహం

చిరు గాలితో జత కలిసిన సుగంధంలా 
నిశిరాత్రి వెలుగును విరజిమ్ము జ్యోతిలా
నీతో స్నేహం మొదలైన క్షణం
నాలో ఉదయించిన ఆనందక్షణాలెన్నో.....!
గాలి లేని పరిమళం ఎంత దూరం పయనించగలదు........?
నీ స్నేహం లేని నేను ఎంత కాలం జీవించగలను........?
నువ్వు నీను......
నీ నా మిత్రులు కలిసి నడుద్దాం ...!!!!!
స్నేహ లోకానికి సమిదులౌదం .!!!!!!!!!!!
...................నీ స్నేహం

Wednesday, April 7, 2010

కలలో కల

కలసి ఇద్దరం చిరునడకలతో పయనించం
కడలి అలలతో ఆనందాన్ని పంచుకోన్నం
కలిసి ఉన్న కాలం
కనులకు అలసట లేదు
మనస్సుకు భాధ లేదు
నా ఒడిలో నీవు ఒదిగిన వేల
నా హృదయ చప్పుడు జోలపాడింది
నన్ను దూరం చేసిన వేల
నా హృదయం ఎకేక్కి ఏడ్చింది
......................................

కనులు తెరిచి చూసాను
కలని తెలిసి తరలి వెళ్ళింది వెన్నెల పరదలోకి నా మనస్సు .......................?