Wednesday, September 29, 2010

నీ స్నేహం

తామసిలో తారవై  ఎదురైనావు
నీ మమకారంతో మైమరిపించావు 
నీ నీడలో నీతో నడిచాను 
నీ స్నేహపు కౌగిటిన మైమరచాలని
పరితపించి నీ బాటలో ఆలిచాను
వెలుగును దాచిన మబ్బులా
నన్ను మదిలో దాచుకొంటావో 
కడలి వడిన వదిగిన గవ్వను 
దరికి చేర్చిన అలలా
దూరం చేస్తావో నీ ఇష్టం నేస్తం............!