నీలి మబ్బున ఉదియించిన హరివిల్లులా తొలి స్వప్నమై మెరిసావే నా లో
సిరి మబ్బున కురిసిన చిరు జల్లులా ..
చిరున్వ్వులేవో విసరావే నాపై
నీ తొలి చూపులతో
నా తనువు నది అలలై సాగే
నీ మధుర అధరముల లయతో
నా గుండె చప్పుడు పెరిగే
నీ చిలిపి నవ్వుల అలలులో
నీ పసిడి పలుకుల వలలో
తొలి కౌగిటిన బంధించవే నీ వడిలో