Wednesday, September 12, 2012

చల్లని వెన్నెలంటి నీ స్నేహం, కావాలి నాకు జీవిత కాలం

నింగి  నుండి  విడివిగా జారిన చినుకులం మనం,
పరిచయాల ప్రవాహంలో వికసించిన కుసుమాలు మనం,
చదువు కోవిలలో తడపడు అడుగులతో విహరించు స్నేహుతులం మనం.

ఓ నేస్తమా... వెన్నెల్లో వర్షమై నీవస్తే
ఆ చినుకుల్లో నే పూవై తడుస్తా
మబ్బుల్లో మెరుపై నీవస్తే
ఆ వెలుగులో నే ఉరుమై వస్తా
నీ ఆశయ సాధనలలో నే అయుదమై నడుస్తా.. 
మిత్రమా!  సంద్రానికి కెరటం అందం,
నింగికి నీలం అందం,
నీ స్నేహం నా జీవితానికి అందం... ఆనందం
ఓ నేస్తమా!  బ్రతుకు తెరువు వేటలో
జీతం కోసం వెతుకు బాటలో నీ రూపం నాకు దూరం కావచ్చు..
కాని....

మినుగులు వెలుగులు మిరిమిట్లుగోలుపుతున్నా వేలా,
వెన్నెలమ్మ చందమామతో దోబూచులాడు వేలా,    
హిమ బిందు ధారతో నా తనువు పులకరించు వేలా,
ఆరుబయట నా ఆలోచనలో 

మరువలేను నేస్తం మరిచిపోను  నీ స్నేహం, 
నీ స్నేహం నా నీడై నాతో పయనిస్తుంది
నీ జ్ఞాపకాలు నా గుండెల్లో అలుపెరగని అలలై కదులుతాయ్ ...
నీ చిరు నవ్వులు నా కనుల కొలనలలో చికటేరగని తారలై వెలుగులీనుతూ మెరుస్తాయ్
నీ అలకలు, నీ కోపాలు, ... నా మదిలో మెదులుతూనే ఉంటాయ్....
ఆ క్షణం....... యతి, ప్రాసలు తెలియని కవినై కావ్య సృష్టి చేసిదను ఇలా....

"ఆ నింగిని పుస్తకంగా తలచి
హరివిల్లును కలంగా మలచి
మన స్నేహ కావ్యంను రచించి

విశ్వాన్ని అబ్బురపరచి
తుది లేని చరితగా మలిచేదును మన స్నేహ కావ్యంను ." 

Monday, February 13, 2012

My First Love Letter

నా ప్రేమకు నా హృదయ ప్రేమ లేఖ.
ప్రియతమా...............!!! 
నిండు వెన్నెల జారుకొనే వేలా సన్నగా జారే మంచు తెరలు పొగలా లోకాన్ని కప్పిన వేలా కిల కిల కోవిల రాగాలలో తొలి పొద్దున తొలకరి చూపులుతో, సిందూర నవ్వులతో ముంగిటిని ముస్తాబు చేస్తుండగా మొదట సారి నిన్ను చూసాను,  ఆ క్షణంన కొండ గాలి సాయంతో కురులు అలలై ఊగుతుంటే అందంగా నువ్వు నవ్వుతుంటే  దివి నుండి భువికి వచ్చిన ఉషోదయ వెన్నెల నీవై నన్ను ఆకర్షించావు 
                   ప్రేమ మొదలు నాకు తెలియదు కానీ నిన్ను చూసినపుడే నా హృదయంలో మొదలైంది ప్రేమ. ఆ రోజు నిన్ను  చూసిన క్షణం నుండి ప్రతి క్షణం నీ కోసమే నా  అన్వేషణ  వెన్నెల కోసం ఎదురు చూస్తున్న నీటి కలువలా వర్షం కై ఎదురు చూస్తున్న హరివిల్లు లా కరగని కలలెన్నో కన్నాను నీకై, తరగని తపనతో చూస్తున్న అలనై. .నింగి నీవై మిన్నంటిన నీలం నేనై నిను చేరి  మురిపించాలని, విరిసిన హరివిల్లు నీవై అ విల్లు వర్ణాలు నేనై నీతొడై నడవాలని, నా మనసు తనువునే వదిలి వర్షంలోను మంచులోనూ అలసట లేకుండా వెతికింది నీకై
నీ వాలు జడన విరజాజులా, నీ కను రెప్పన కాటుకలా, నీ జతన చేరే నాడు ఏనాడూ ఎదురౌనో నాకు.
 నా ప్రాణం చెట్టు నీడలో రాలిన ఆకుల నడుమ నిన్ను చేరాలనే తపనతో స్వేదంలో తడిసిన దేహంతో నిరక్షన్లో ఉన్న నేను ఏ క్షణమైతే నిను  చూసానో నేను ఆ క్షణం  మొదలు ఏ క్షణమైనా ఆలోచించానా నాకై నేను. నేను  స్వార్ద ప్రేమకున్ని కాదు నీ ఇష్టం లేకుండా నా ప్రేమను అంగికరించకు నువ్వు నవ్వి నన్ను నవ్వించు నిన్ను నీవు ప్రేమించి నా ప్రేమను  ప్రేమించు.ఓ ప్రియ తరుణి నీ చీకటి దారిలో నే వెన్నెలై,  ఆ వెన్నెల వెలుగులో నీ నీడనై,  అందమైన ఆనంద లోకాన్ని అరిచేతిని చేరిచ్చి జీవిత కాలం నీతోనే నడుస్తాను. నా ప్రతి ఆలోచనలో  నీవే నా ప్రతి అక్షరంలో నీవే.నిను చూసిన వేల నుండి  ఈ లోకంలో ప్రతిది చాల అందంగా కనిపిస్తుంది ప్రతి క్షణం నా హృదయం సంతోషంతో త్రుల్లుతుంది. ఇంత ఆనందానికి  కారణమైన నిన్ను నా హృదయంన పువ్వుల కోవిలలో కలువ బిందువుల అబిషేకంతో నీ రూపంను ప్రతిష్టిoచాను.   

 ....
 ........
 .............
కానీ నా కల లో నిన్ను చూసాను నిజంగా నీ రూపం ఉందా? ఉంటె ఎలా ఉంటావు? నిన్ను గుర్తించడం ఎలా, అసలు ఎక్కడ నీవు! ఏం చేస్తున్నావు?