Wednesday, September 12, 2012

చల్లని వెన్నెలంటి నీ స్నేహం, కావాలి నాకు జీవిత కాలం

నింగి  నుండి  విడివిగా జారిన చినుకులం మనం,
పరిచయాల ప్రవాహంలో వికసించిన కుసుమాలు మనం,
చదువు కోవిలలో తడపడు అడుగులతో విహరించు స్నేహుతులం మనం.

ఓ నేస్తమా... వెన్నెల్లో వర్షమై నీవస్తే
ఆ చినుకుల్లో నే పూవై తడుస్తా
మబ్బుల్లో మెరుపై నీవస్తే
ఆ వెలుగులో నే ఉరుమై వస్తా
నీ ఆశయ సాధనలలో నే అయుదమై నడుస్తా.. 
మిత్రమా!  సంద్రానికి కెరటం అందం,
నింగికి నీలం అందం,
నీ స్నేహం నా జీవితానికి అందం... ఆనందం
ఓ నేస్తమా!  బ్రతుకు తెరువు వేటలో
జీతం కోసం వెతుకు బాటలో నీ రూపం నాకు దూరం కావచ్చు..
కాని....

మినుగులు వెలుగులు మిరిమిట్లుగోలుపుతున్నా వేలా,
వెన్నెలమ్మ చందమామతో దోబూచులాడు వేలా,    
హిమ బిందు ధారతో నా తనువు పులకరించు వేలా,
ఆరుబయట నా ఆలోచనలో 

మరువలేను నేస్తం మరిచిపోను  నీ స్నేహం, 
నీ స్నేహం నా నీడై నాతో పయనిస్తుంది
నీ జ్ఞాపకాలు నా గుండెల్లో అలుపెరగని అలలై కదులుతాయ్ ...
నీ చిరు నవ్వులు నా కనుల కొలనలలో చికటేరగని తారలై వెలుగులీనుతూ మెరుస్తాయ్
నీ అలకలు, నీ కోపాలు, ... నా మదిలో మెదులుతూనే ఉంటాయ్....
ఆ క్షణం....... యతి, ప్రాసలు తెలియని కవినై కావ్య సృష్టి చేసిదను ఇలా....

"ఆ నింగిని పుస్తకంగా తలచి
హరివిల్లును కలంగా మలచి
మన స్నేహ కావ్యంను రచించి

విశ్వాన్ని అబ్బురపరచి
తుది లేని చరితగా మలిచేదును మన స్నేహ కావ్యంను ."