Saturday, March 19, 2011

తరుణి తొలి సిగ్గు బావాలు

తొలి పొద్దుల్లో విరిసే తొలి పువ్వులా
తొలి పైటలో తొగి చూసే నీ సిగ్గు
ఆ సిగ్గు వడిలో పరువం పరువళ్ళు తొక్కే వేల
కనులలో కళలు అలలై ఎగిసే
అలలుపై నురగె నీ చిరునవ్వై పూసే
మదిలో ఉహాలు ఊయాలై ఊగె.....
ఆ క్షణం గుండె లోతులో గూడు కట్టే జ్ఞాపకాలు పదిలం
యదలో సరిగమలు తీసే తలంపులు మధురం
ఓ స్త్రీ....! నీ కను సైగకు కలువ మామ కొలువు తిరు నీ చెంత.....
నీ సొగసరి కను చూపులకు చిగురాకున పూసిన 
                                 సిరిమల్లెలు చేరే నీ దోసిట ......
సుందరి నీ రమణీయ సౌందర్య రూపానికి 
సింధూరం సిగ్గు వలచె
మందారం మైమరచె
ఓ  తరుణి....! నీ పైట అందాలకు పులకించింది ఈ ధరణి.
ప్రకృతి అందంగా ఉంటె ఆ అందం నీలా ఉంది ఈ వేలా ....  



  

No comments:

Post a Comment