Wednesday, December 21, 2011

Gift For U


వెండి మబ్బున దాగిన వెన్నెల వోలె
అమ్మ వడిలో దాగవు,
కొండ చాటున చేరిన భానుడు వోలె
నాన్న కౌగిటిన చేరావు,
తడబడు అడుగులతో,
నవ్వు గొలుపు మాటలతో
మురిపించావు ఆ మాతృమూర్తులను 
మబ్బుల్లో మెరిసింది మెరుపు,
ఈ చిన్నారి బుగ్గల్లో చేరింది ఆ వెలుగు 
చల్లని కబురు తెచ్చే కొండగాలి 
తన కురులను దువ్వె ఈ కొంటె గాలి 
నీలకాశమే గౌనులా
నిశిధి తారలె చెవి రింగుల్లా 
చంద్రవంకే  నుదుట దిష్టి చుక్కల్లా
ఈ చిన్నారికి కానుకులై నింగి నేలకు వచ్చిన వేల 
అందంలో  చంద్రమణి 
మరామం చేసే బాలామణి
                     ణి..................
నింగి నుండి జాలు వారు మంచు తెరలు వర్షించు వేలా
తొలి వెచ్చని కిరణాలు చిగురాకులను తాకు వేల 
చల్లని గాలులలో .....
ఈ ఉషోదయంన......
నీ జన్మోదయం ఓ అందమైన హరివిల్లులా మారి
ఆనందవర్శంలో తడిసిపోవాలి ఈ జీవితం 
నీ నవ్వుల అందాలతో మురిసిపోవాలి ఈ రంగుల లోకం .....
వెన్నెల్లో వర్షంలా
వసంత కాలపు పుష్పంలా ,
కొలనన చిందేసే అలలా
అంబరాన విహరించు హంసలా
నవ్వులతో సాగాలి నీ జీవితం........

                    చిన్ని పెదవులుపై చిందులేసే
                   నీ చిరునవ్వులుకు జన్మోదయ శుభాకాంక్షలు

No comments:

Post a Comment