పొగ మంచుల్లో సింధూరం,
నా ప్రతి కలలో నీ సింగారం,
దరి చేరుతావు కలలా,
దూరమౌతావు అలలా,
నీ రాక ఓ మధురం,
నీ వీక్షణం ఓ అధరం,
నీలి మేఘాల నీడతో
నా హృదయ తాపాన్ని పంపాన ,
ఏడు రంగుల హరివిల్లుల్లో
నా ఆర్తనందాన్ని చూపన,
నీవు లేవన్న విషయం విని
నీటి బుడగ వలె మరణించనా!
మరణించను.
ఎందుకు మరణించాలి?
నీతో జీవించాలనే ఆకాoక్షయే కాని
మరణించాలానే కాంక్ష లేదు కదా!
నీవు లేని లోకం నాకు
శూన్యమెలా!
లోకమంతా నువ్వే ,
నేనంత నువ్వే .
నీ ఆశలకు ఊపిరౌతా,
నీ ఆశయాలకు ఆయుధమౌతా.
లోకంల్లో ప్రతి వస్తువు నిన్నే తపిన్చేలా
నీవు జయించాలనుకోన్నవి జయించలేకపోయినా,
నేను జయిస్తా .
నీ కీర్తీ దేదిప్యామానం చేస్తా.
ఇదే న లక్ష్యం, ఇదే నా ఆశయం.
నా చెంత ఈ వింత లక్ష్యం ఏమీటని
ఈ లోకం అడగొచ్చు ,
నా మీత్రులు ప్రశ్నించవచ్చు,
నా తోటి వారు పరిహసించవచ్చు,
ఐన సరే నీ ఆశయాలను విడవజాలను.
నీకై జీవిస్తా ,
నీ ఆశయాలను సజీవం చేస్తా.
నీకై మళ్లి జన్మిస్తా ......
నీకై మళ్లి జన్మిస్తా ............