Wednesday, March 24, 2010

ముదసలి

వాడిన పువ్వును నేను
వాకిటింట ఎందుకని వేలేసారు
మొగ్గ దశలో ఆదరించారు
విచ్చుకొన్న వేల ఆరాదించారు
నాడు నాలుగు కడుపులు నింపిన నాకు
నేడు పట్టెడన్నం కరువైంది
కని పెంచిన నన్ను
కనిపించని ప్రాంతాలకు నేడుతుంటే
కనుల మాటున దాగిన కన్నీటి ఘోషను

ఎవరికి చెప్పుకోను!
ఎలా చెప్పుకోను!
నా ఈ స్ధితి రేపు వారికి వస్తుందని తెలియదు కాబోలు ............?

No comments:

Post a Comment