Friday, March 26, 2010

నీ స్నేహం

జీవితం, బ్రతుకు తెరువు వేటలో
జీతం కోసం వెతుకు భాటలో
నాకు దూరంగా ఉంచింది నిన్ను ఈ లోకం
ఎక్కడ నువ్వు
ఎక్కడ నేను
వెన్నెల రాత్రిన తూర్పు గాలివి నీవు,
ఉదయకాలపు మంచు తెరల మాటున
దాగిన సాలిగూడను నేను,
జీవ కోటిని మధుర స్వప్నాలతో నిద్రింప చేయట నీ విధి.
భానుడు కాంతులకు అస్తమించడం నా విధి.
అట్టి నాకు
నీ స్నేహం మిగిల్చిన ఆనందక్షణాలెన్నో
లోకం చీకటి దుప్పటిలోకి
జారుకోన్నప్పుడు,
నేను జంకినప్పుడు,
నా చేయి పట్టి నడిపావు
నీ చేతి స్పర్సతో
నా హృదయంన ఆవరించిన భయం దూరమైంది.
నీవు నా చెంత ఉంటే చాలు
ఈ ప్రపంచాన్ని జేయించలేనేమో కాని
నా జీవితాన్ని జేయిస్తా,
నా జన్మ సార్ధకత చేసుకొంటా ....................

No comments:

Post a Comment