Friday, March 26, 2010

నీ స్నేహం

జీవితం, బ్రతుకు తెరువు వేటలో
జీతం కోసం వెతుకు భాటలో
నాకు దూరంగా ఉంచింది నిన్ను ఈ లోకం
ఎక్కడ నువ్వు
ఎక్కడ నేను
వెన్నెల రాత్రిన తూర్పు గాలివి నీవు,
ఉదయకాలపు మంచు తెరల మాటున
దాగిన సాలిగూడను నేను,
జీవ కోటిని మధుర స్వప్నాలతో నిద్రింప చేయట నీ విధి.
భానుడు కాంతులకు అస్తమించడం నా విధి.
అట్టి నాకు
నీ స్నేహం మిగిల్చిన ఆనందక్షణాలెన్నో
లోకం చీకటి దుప్పటిలోకి
జారుకోన్నప్పుడు,
నేను జంకినప్పుడు,
నా చేయి పట్టి నడిపావు
నీ చేతి స్పర్సతో
నా హృదయంన ఆవరించిన భయం దూరమైంది.
నీవు నా చెంత ఉంటే చాలు
ఈ ప్రపంచాన్ని జేయించలేనేమో కాని
నా జీవితాన్ని జేయిస్తా,
నా జన్మ సార్ధకత చేసుకొంటా ....................

ఇష్టం

నిన్ను చూసిన తరుణం
కురిసింది నా మదిలో ఆనందవర్షం,
నీ తొలి పరిచయంతో
వెలిసింది నా మదిలో ఓ పూలవనం
నీ పెదవుల చాటున పలికిన నా పదం
నా మనస్సును పరవసింపచేసింది
ఇంత ఆనందాన్ని పంచిన నీతో జీవించలనుంది.........!
నా ఈ విన్నపాన్ని మన్నించి దరి చేరుతవో,
మన్నించక దూరమౌతవో
నీ ఇష్టం......................

Thursday, March 25, 2010

ఆకర్షణ

నీ మోము కాంతులు
మెరుపు కాంతుల వలె,
నీ కనుల వెలుగు
నింగిన ఉదయించిన తారల వలె,
నీ సౌందర్య కాంతి నా యదను తాకినపుడు,
ఉదయించిన నా మనోభావాలను ఏమని వర్ణీంపను............?

Wednesday, March 24, 2010

ప్రేమ

మునుపెన్నడు ఎరగని మమకారంతో
నా యదను తాకింది నీ చిరునవ్వు
నిన్ను చూసిన తొలి తరుణంన
భానుడు తొలి కిరణం వలె
అందంగా నవ్వింది నా మనస్సు
మరో క్షణం కనిపించవా!
నా విన్నపం మన్నించవా!

ముదసలి

వాడిన పువ్వును నేను
వాకిటింట ఎందుకని వేలేసారు
మొగ్గ దశలో ఆదరించారు
విచ్చుకొన్న వేల ఆరాదించారు
నాడు నాలుగు కడుపులు నింపిన నాకు
నేడు పట్టెడన్నం కరువైంది
కని పెంచిన నన్ను
కనిపించని ప్రాంతాలకు నేడుతుంటే
కనుల మాటున దాగిన కన్నీటి ఘోషను

ఎవరికి చెప్పుకోను!
ఎలా చెప్పుకోను!
నా ఈ స్ధితి రేపు వారికి వస్తుందని తెలియదు కాబోలు ............?

అమ్మ

నిదుర రాణి రాత్రి
తన ఒడిలో
తన కధలో
జాబిలమ్మ జతన చేర్చి
అంతులేని ఆనందమున ముంచుటలో
నీకు నీవే సాటి

నీ స్నేహం

నన్ను విడిచి పయనిoచావు
దుఃఖ సాగరంల్లో దించావు
అక్కడ నవ్వులే నువ్వు
ఇక్కడ నవ్వు లేని నేను

Monday, March 22, 2010

నీటి బిందువు

సర్వ ప్రాణుల దాహర్తి తీర్చడం నాకిష్టం
జీవకోటి మనుగడే నా కర్తవ్యం
పుడమి లేని నేను లేను
నేను లేని నువ్వు లేవు
ఒడిసిపట్టి పొదుపుగా వాడుకో
భావితరాల భవిష్యత్ కాపాడుకో
అందంలో హరివిల్లును
విలువలో ముత్యంను మించిన దానిని
అట్టి నన్ను నిర్లక్ష్యం చేయకు సుమా.....!
మీ నేస్తం ............... నీటి బిందువు

Sunday, March 21, 2010

నీ స్నేహం

నా మనస్సు తలపులు తెరిచి ఉంచానీకై
మమతానురాగాలు కురిపిస్తావని నాపై
మది నిండా నీ స్నేహ గుర్తులతో జీవిస్తున్న నీకై
కరుణ వర్షం కురిపిస్తావని నాపై
నన్ను వదలి నడిచిన నీ బాటకై
వెతుకుతుంది నా కన్నీటి ప్రవాహం
నీ మధుర స్మృతుల ఆటలో
నీ బాట వెతుకు బాటలో
నా నయనాలు ఆలసినాయి కదా నేస్తం ............

నీ స్నేహం

మంచు కురిసే వేల
మల్లెలు పూచాయి మీలా
సంద్రాలు ఎండేలా సూర్యుడే మండీనా
కాలాలు కరిగేలా యుగాలే దొర్లినా
చెరిగిపోని బందం ఈ స్నేహ బందం

నీ స్నేహం

ఏ నాటిదో ఈ బందం
తీరానికి అందని తీయ్యని బందం
ఎగిసి పడే కెరటాల అనుబంధం
మన ఈ స్నేహ బందం

వెన్నెల

మలి సంధ్య వేల ఉదయించిన ఓ వెన్నెల ...
తొలి సంధ్య వేల అస్తమిస్తావేలా!
నీవు జారుకొన్నా వేల
నా హృదయం జారుతుంది జాజిపువ్వులా,
అని వాపోతుంది నాలా ఈ వేలా.

వెన్నెల

అందనంత దూరంలో
అందరికి కన్పించే అందమైన జాబిలి
నీ జత కోసం వేల కోట్ల నయనాలు విక్షిస్తున్నాయ్.
నీవు ఎవరికి అందవా.........!
అందొద్దు.......
అందం నీకే సొంతం
నీ అందం ప్రపంచానికి సొంతం
నీది నీరు పెదక బంధం
నీవే మా ఇంటి ద్వీపం.

నీ స్నేహం

వెన్నెల్లో వర్షంలా
వసంత కాలపు పుష్పంలా
సిరివానజల్లుల్లో తడిసిన చమంతిలా
చందమామ వెలుగుల్లో మల్లెలా
నిరంతరం నవ్వులతో సాగాలి ఈ జీవితం.

నీ స్నేహం

ఉదయించే ఉదయాలు,
విసిగించే మద్యహనలు,
నిదుర రాని రాత్రులు,
ఎన్నో వస్తాయి పోతాయి
ఇవేవి మన స్నేహాన్ని చేరిపివేయలేవు.
మీతో స్నేహం మరుపు రాని మరో లోకం.

లవర్ ఇస్ నాట్ లైఫ్, లవ్ ఇస్ లైఫ్

పొగ మంచుల్లో సింధూరం,
నా ప్రతి కలలో నీ సింగారం,
దరి చేరుతావు కలలా,
దూరమౌతావు అలలా,
నీ రాక ఓ మధురం,
నీ వీక్షణం ఓ అధరం,
నీలి మేఘాల నీడతో
నా హృదయ తాపాన్ని పంపాన ,
ఏడు రంగుల హరివిల్లుల్లో
నా ఆర్తనందాన్ని చూపన,
నీవు లేవన్న విషయం విని
నీటి బుడగ వలె మరణించనా!
మరణించను.
ఎందుకు మరణించాలి?
నీతో జీవించాలనే ఆకాoక్షయే కాని
మరణించాలానే కాంక్ష లేదు కదా!
నీవు లేని లోకం నాకు శూన్యమెలా!
లోకమంతా నువ్వే ,
నేనంత నువ్వే .
నీ ఆశలకు ఊపిరౌతా,
నీ ఆశయాలకు ఆయుధమౌతా.
లోకంల్లో ప్రతి వస్తువు నిన్నే తపిన్చేలా
నీవు జయించాలనుకోన్నవి జయించలేకపోయినా,
నేను జయిస్తా .
నీ కీర్తీ దేదిప్యామానం చేస్తా.
ఇదే న లక్ష్యం, ఇదే నా ఆశయం.
నా చెంత ఈ వింత లక్ష్యం ఏమీటని
ఈ లోకం అడగొచ్చు ,
నా మీత్రులు ప్రశ్నించవచ్చు,
నా తోటి వారు పరిహసించవచ్చు,
ఐన సరే నీ ఆశయాలను విడవజాలను.
నీకై జీవిస్తా ,
నీ ఆశయాలను సజీవం చేస్తా.
నీకై మళ్లి జన్మిస్తా ......
నీకై మళ్లి జన్మిస్తా ............