Wednesday, December 21, 2011

Gift For U


వెండి మబ్బున దాగిన వెన్నెల వోలె
అమ్మ వడిలో దాగవు,
కొండ చాటున చేరిన భానుడు వోలె
నాన్న కౌగిటిన చేరావు,
తడబడు అడుగులతో,
నవ్వు గొలుపు మాటలతో
మురిపించావు ఆ మాతృమూర్తులను 
మబ్బుల్లో మెరిసింది మెరుపు,
ఈ చిన్నారి బుగ్గల్లో చేరింది ఆ వెలుగు 
చల్లని కబురు తెచ్చే కొండగాలి 
తన కురులను దువ్వె ఈ కొంటె గాలి 
నీలకాశమే గౌనులా
నిశిధి తారలె చెవి రింగుల్లా 
చంద్రవంకే  నుదుట దిష్టి చుక్కల్లా
ఈ చిన్నారికి కానుకులై నింగి నేలకు వచ్చిన వేల 
అందంలో  చంద్రమణి 
మరామం చేసే బాలామణి
                     ణి..................
నింగి నుండి జాలు వారు మంచు తెరలు వర్షించు వేలా
తొలి వెచ్చని కిరణాలు చిగురాకులను తాకు వేల 
చల్లని గాలులలో .....
ఈ ఉషోదయంన......
నీ జన్మోదయం ఓ అందమైన హరివిల్లులా మారి
ఆనందవర్శంలో తడిసిపోవాలి ఈ జీవితం 
నీ నవ్వుల అందాలతో మురిసిపోవాలి ఈ రంగుల లోకం .....
వెన్నెల్లో వర్షంలా
వసంత కాలపు పుష్పంలా ,
కొలనన చిందేసే అలలా
అంబరాన విహరించు హంసలా
నవ్వులతో సాగాలి నీ జీవితం........

                    చిన్ని పెదవులుపై చిందులేసే
                   నీ చిరునవ్వులుకు జన్మోదయ శుభాకాంక్షలు

Friday, July 1, 2011

first meet

నీలి మబ్బున ఉదియించిన హరివిల్లులా
తొలి స్వప్నమై మెరిసావే  నా లో
సిరి మబ్బున కురిసిన చిరు జల్లులా  ..
చిరున్వ్వులేవో విసరావే నాపై 
నీ తొలి చూపులతో
నా తనువు నది అలలై సాగే
నీ మధుర అధరముల లయతో 
 నా గుండె చప్పుడు  పెరిగే
నీ చిలిపి నవ్వుల అలలులో 
నీ పసిడి పలుకుల  వలలో
తొలి కౌగిటిన బంధించవే నీ వడిలో



Friday, June 3, 2011

yours

నీ చెలిమి కనులలో సూటిగా చూడు 
నీ మనస్సును తన దగ్గరకు చేర్చి చూడు 
 తెల్లవారౌతున్న రాత్రి మొదలు 
చీకటి వడిలోకి చేరు పగలు వరకు 
తను నీకై  ఎన్ని సార్లు  ఎదురు చూసిందో
నీకై ఎదురు చూపులో  తన చుట్టూ తానూ ఎన్ని ప్రదక్షణాలు  చేసిందో
తన వేలు గోరులు అరిగేలా 
తన కాలి మడిమలు మండేలా
తీరిక లేక నీ తీపి జ్ఞాపకాలతో 
నిన్ను కలవాలని ఎదురు చుస్తూ...
ఆరాటపడుతుంది అందమైన ఓ మనస్సు ..
                                             నీల్....



-- 
Neel

Saturday, March 19, 2011

super moon


వెన్నెల  వెన్నెల నాకై దరికి వచ్చావా ఈ వేలా
మెల్లగ మెల్లగా కధలెన్నో చెప్పవా అమ్మలా
చల్లగా చల్లగా ఊసులేవో చెప్పి 
ఉరడించి వేల్లవా తొలి సంద్యకు 
నిండుగా నిన్నాలా చూస్తుంటే 
మదిలో వెలిగే మరో వెన్నెల నీలా.......



తరుణి తొలి సిగ్గు బావాలు

తొలి పొద్దుల్లో విరిసే తొలి పువ్వులా
తొలి పైటలో తొగి చూసే నీ సిగ్గు
ఆ సిగ్గు వడిలో పరువం పరువళ్ళు తొక్కే వేల
కనులలో కళలు అలలై ఎగిసే
అలలుపై నురగె నీ చిరునవ్వై పూసే
మదిలో ఉహాలు ఊయాలై ఊగె.....
ఆ క్షణం గుండె లోతులో గూడు కట్టే జ్ఞాపకాలు పదిలం
యదలో సరిగమలు తీసే తలంపులు మధురం
ఓ స్త్రీ....! నీ కను సైగకు కలువ మామ కొలువు తిరు నీ చెంత.....
నీ సొగసరి కను చూపులకు చిగురాకున పూసిన 
                                 సిరిమల్లెలు చేరే నీ దోసిట ......
సుందరి నీ రమణీయ సౌందర్య రూపానికి 
సింధూరం సిగ్గు వలచె
మందారం మైమరచె
ఓ  తరుణి....! నీ పైట అందాలకు పులకించింది ఈ ధరణి.
ప్రకృతి అందంగా ఉంటె ఆ అందం నీలా ఉంది ఈ వేలా ....  



  

Thursday, February 24, 2011

My world

ఉహ ఓ అధ్బుత లోకం
ఆ ప్రపంచంలో బాధకు చోటే లేదు ..

ఆనందంకు ముగింపే లేదు....

నా ఈ లోకంలో నాకు చెరువ కానిది

నాకు ధూరమైనది ఏది లేదు

పున్నమి వెన్నెల్లో
పూల వర్షంలో

చిరుగాలినై విహరించి

లోకాలే తిరిగొచ్చ

నల్లని మబ్బులో
సన్నని జల్లులలో

హరివిల్లునై ఉదయించా....

నింగినే చుంబించా...

నా ఈ లోకంలో ఆకలి లేదు
దాహం లేదు....

జీతం కోసం వెతుకుబాటలో

నిద్ర రాణి రాత్రులు లేవు

నిత్యం టెన్షన్ తో జీవించే ఈ జీవిత ప్రయాణంలో
మీరు ఓ సారి మీ ఉహ లోకంలో ఎంటర్ అవ్వండి

నిజ జీవితంలో చూడని ప్రకృతి సౌందర్య దృశ్యాలు

చేతికందని ఆశయాలు

కాదేది అసాధ్యం ఈ లోకంలో

Nothing is impossible in the world of imagination
every thing is possible here

so now enter in ur  own world

enjoy the day-end

                       >>Neel<<

Saturday, February 19, 2011

ప్రేమ

తొలి కిరణాలకు విరభుసే పూలు
నీ తొలి చూపులుకు ఉదయించే నాలో ఆశలు 
చిగురాకుల  పొత్తిళ్ళలో విరిసే సిరిమల్లెలా
నా హృదయ వడిలో వెలసే నీ రూపం 
నీవు నడిచే ఈ చోట 
మబ్బే వర్షించే ఈ పూట
నీ కురులు సవరించు వేల 
మేఘమే మెరుపై చేరదా! పూలులా
నీ చెక్కిల్లపై తేలియాడు లేలేత సిగ్గులు
నా గుండెలో చేరి.......
శ్వాసలా మారి.......
నువ్వే నేనంటు చేసిందే నీ నవ్వు
నీ నవ్వుల లోకంలో నాకు గురుతే రాదే ఈ లోకం 
నిను  చూసిన నా మనస్సు 
వశమాయే నీకు ...........................